ప్రతి మానవుడు తన చిన్నతనం నుండి తాను పెరిగి పెద్దయ్యాక ఈ సమాజంలో తన జీవితం ఎలా ఉండాలనే దాని గురించి అనేక అందమైన ఊహాగానాలు చేసుకుంటూ, ఆ ఊహలను తన హృదయంలో భద్రపరుచుకుని, వాటిని సాధించడం కొరకు రక రకాల ప్రణాళికలను వేసుకొని ఆ మార్గంలో ప్రయాణిస్తున్నప్పుడు. అతను అనుకోని అనేక రకాల సమస్యలను ఎదుర్కొంటూ తన జీవిత లక్ష్యాన్ని చేరుకోవడానికి ప్రయాణిస్తాడు. కానీ చివరికి కొన్నిసార్లు ఆ ప్రయత్నాలు విఫలమవుతాయి. దానికి గల కారణం అతని యొక్క జన్మజాతకములో అతని యొక్క కర్మను అనుసరించి గృహస్థితి సరిగ్గా లేకపోవడమే. అందువల్ల ఎంత ప్రయత్నించినా చివరిదాకా కొనసాగి చివరికీ విఫలమవుతుంటాయి. ఇటువంటి సమయాలలో నిరుత్సాహంతో కృంగిపోయి బాధతో ఉంటారు. కనుక అటువంటి వారు మీ యొక్క దగ్గరలో ఉన్నటువంటి అనుభవజ్ఞులైన జ్యోతిష్ణకు మీయొక్క జన్మజాతక పత్రాన్ని చూపించిన యెడల వారు ఆ యొక్క జాతక పత్రాన్ని పరిశీలించి మీరు చేయవలసినటువంటి పరిహారాలను తెలియపరుస్తారు అట్టి పరిహారాలు ను చేసిన మీరు గ్రహాల యొక్క అనుగ్రహం వలన మీరు మీ కెరియర్లో మీరనుకున్నటువంటి స్థానాలను అధిరోహిస్తారు.